Advertisement
మన పత్రిక, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్లో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలుడు ఆన్లైన్లో కొనుగోలు చేసిన 100 అయస్కాంతాలను మింగేశాడు. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఎక్స్‌రే తీశారు. సుమారు 80 నుంచి 100 అయస్కాంతాలు బాలుడి పేగుల్లో చిక్కుకుపోయి, దెబ్బతిన్నట్లు గుర్తించారు.
Advertisement
ఆ దేశంలో 2013 నుంచే ఇలాంటి ప్రమాదకర అయస్కాంతాలపై నిషేధం ఉంది. అయినప్పటికీ, ‘టెము’ (Temu) అనే ఆన్లైన్ కంపెనీ వాటిని విచ్చలవిడిగా అమ్ముతుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిషేధిత వస్తువులను అమ్ముతున్న సదరు సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

