మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే, మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆయుష్షును పెంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ నిపుణుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ టిమ్ తియుటాన్.. మనం ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించడానికి ఐదు కీలక సూత్రాలను వివరించారు. క్యాన్సర్ రోగులకు చికిత్స అందించిన అనుభవంతో, 2026లో మరింత ఉత్సాహంగా ఉండాలనుకునే వారి కోసం ఆయన ఈ సలహాలు ఇచ్చారు.
1. తగినంత నిద్ర ఆరోగ్యకరమైన జీవితానికి నిద్ర పునాది లాంటిదని డాక్టర్ టిమ్ తెలిపారు. ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గంటల గాఢ నిద్ర అవసరమని, సరైన నిద్ర ఉండే వారిలో అకాల మరణాల ముప్పు గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
2. ఆత్మీయులతో అనుబంధం కుటుంబ సభ్యులు, స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడపడం మన ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఒంటరితనం కంటే ఆత్మీయుల మధ్య ఉండటం వల్ల మానసిక, శారీరక దృఢత్వం కలుగుతుందని డాక్టర్ సూచించారు.
3. ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని నిర్ణయించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్ చేసిన మాంసం, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని డాక్టర్ టిమ్ హెచ్చరించారు. వాటికి బదులుగా తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని సలహా ఇచ్చారు.
4. శారీరక శ్రమ వ్యాయామం కేవలం బరువు తగ్గడానికే కాకుండా ఆయుష్షును పెంచడానికి దోహదపడుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులు, షుగర్, క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుందని, మరణాల రేటును 30 నుంచి 35 శాతం తగ్గించవచ్చని ‘జర్నల్ ఆఫ్ ఏజింగ్ రీసెర్చ్’ (2012) నివేదికను ఉటంకిస్తూ ఆయన వివరించారు.
5. మానసిక ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యమైనది మానసిక ఆరోగ్యం. డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తాయని, అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవాలని, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అలవర్చుకోవాలని డాక్టర్ టిమ్ సూచించారు.
ఈ ఐదు సూత్రాలను పాటిస్తే కొత్త ఏడాదిలో ఆరోగ్యం మీ సొంతం అవుతుందని ఆయన భరోసా ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
