Advertisement

Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు..

మన పత్రిక, వెబ్​డెస్క్: వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా కొత్త ఎలక్ట్రానిక్ విధానాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ వెల్లడించారు. ఈ ఏడాదిలోనే దేశవ్యాప్తంగా ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.

ప్రస్తుతం దేశంలోని 10 ప్రాంతాల్లో ఈ పద్ధతి ప్రయోగాత్మకంగా అమలవుతోంది. ఫాస్ట్ టాగ్ తరహాలోనే, వాహనం టోల్ ప్లాజా మీదుగా వెళ్తుండగానే ఆటోమేటిక్ గా డబ్బులు కట్ అయ్యేలా టెక్నాలజీని రూపొందించారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడంతో పాటు ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది.

Advertisement
Advertisement