మన పత్రిక, వెబ్‌డెస్క్ : జగన్ ప్రభుత్వంలో నిరసనలకు దిగిన అంగన్వాడీలకు ప్రభుత్వం పలు శుభవార్తలు తెలిపింది. నెల రోజుల్లో వారికి కొత్త సెల్ ఫోన్లు అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటికే మూలన పడిన సెల్ ఫోన్లను వాడుతున్న వారికి ఈ నిర్ణయం పని వేగాన్ని, సమర్థతను పెంచేందుకు దోహదపడుతుంది.
అంతే కాకుండా అంగన్వాడీల్లో ఇండక్షన్ స్టవ్‌ల వాడకానికి వీలుగా, నెలకు రూ. 500 చొప్పున విద్యుత్ ఛార్జీలను కూడా ప్రభుత్వమే భరించనుంది. అయితే, సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీకి అంగన్వాడీ కార్యకర్తలను వినియోగించరాదని ప్రభుత్వం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయాలు అంగన్వాడీల పనితీరును మెరుగుపరచడంతోపాటు, వారిపై పనిభారాన్ని తగ్గించగలవని ప్రభుత్వం పేర్కొంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
