సోషల్ మీడియాలో ఈ మధ్య లేని పోనీ విషయాలకు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా సెలెబ్రిటీల విషయంలో నెటిజన్లు, కామన్ పబ్లిక్ అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఫైర్ అవుతున్నారు. నిన్న నటి రేణు దేశాయ్ (Renu Desai) పైన కూడా సోషల్ మీడియాలో అసలు విషయం తెలుసుకోకుండా ట్రోల్ చేస్తున్నారు. అలాగే తాజాగా ఓ సరదా సంఘటన విషయంలో తాజాగా ఓ తెలుగు హీరోయిన్ ని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కమిటీ కుర్రోళ్ళు (Comitte Kurrollu), తాజాగా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో (The Great Pre Wedding Show) వంటి సినిమాలో హీరోయిన్ గా నటించిన తెలుగమ్మాయి “టీనా శ్రావ్య” (Teena Shravya) పై ఈ ట్రోలింగ్ నడుస్తుంది.
నటి శ్రావ్య తాజాగా తన పెంపుడు కుక్కతో తులాభారం వేయించింది. అది సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు మేడారం (Medaram) జాతరను, సంప్రదాయాలను అవమానించిందని నెట్టింట ట్రోల్ చేస్తున్నారు జనాలు. అయితే ఆ సోషల్ మీడియాలోనే వచ్చిన కామెంట్స్ లో చాలా వరకు శ్రావ్యకు సపోర్ట్ గా కూడా వస్తున్నాయి.
కొందరు నెటిజన్ల కామెంట్స్ ని గమనిస్తే, పలువురు నెటిజన్లు కుక్కకి తులాభారం వేసినా కూడా తప్పేమి కాదని, అది ఆ కుక్కపై ప్రేమ చూపించడం గాని, కల్చర్ ని అవమానించడం కాదని, రాఖి పండక్కి కుక్కలకు కూడా ఎలా రాఖీ కడుతున్నారో, ఇది కూడా అలాంటిదేనని కామెంట్స్ వస్తున్నాయి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
