మన పత్రిక, వెబ్డెస్క్: Nellore Mayor Sravanthi : నెల్లూరు నగరపాలక సంస్థ (Nellore Corporation) రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి ముందే మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 18న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాల్సి ఉండగా, అంతకంటే ముందే ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
రాజీనామా లేఖను నేడు కలెక్టర్కు అందజేయనున్నట్లు స్రవంతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజన బిడ్డనైన తనను రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు పన్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా ఉన్న కార్పొరేటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరులో మొత్తం 54 మంది కార్పొరేటర్లు ఉండగా, ఎన్నికల అనంతరం 42 మంది వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లడంతో సమీకరణాలు మారిపోయాయి.
మేయర్ భర్త జయవర్ధన్ కూడా టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తదితరుల రాజకీయ అంతం చూస్తామని హెచ్చరించారు.
