Advertisement

కార్పొరేటర్‌గా గెలుపు.. నవ్య హరిదాస్ ఆదర్శం.

మన పత్రిక, వెబ్​డెస్క్: కేరళ బీజేపీ నాయకురాలు నవ్య హరిదాస్ (Navya Haridas) రాజకీయ నిబద్ధత ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇటీవలే వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీపై బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. సాధారణంగా ఎంపీగా పోటీ చేసిన నాయకులు, ఆ స్థాయికి తగ్గ చిన్న ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపరు.

కానీ, నవ్య హరిదాస్ మాత్రం పార్టీ ఆదేశాల మేరకు ఎలాంటి భేషజాలకు పోకుండా కేరళలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బరిలోకి దిగారు. కోజికోడ్ (Kozhikode) కార్పొరేషన్‌లోని ‘కరప్పరంబు’ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీ అభ్యర్థి స్థాయి నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి గెలవడం ఆమె నిబద్ధతకు నిదర్శనమని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు.

Advertisement

తెలుగు రాష్ట్రాల్లో పదవుల కోసం పట్టుబట్టే నాయకులకు నవ్య హరిదాస్ తీరు ఒక పాఠం లాంటిదని, ఆమెలో సుష్మా స్వరాజ్ స్థాయి కార్యదీక్ష కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement