Advertisement

నర్సాపూర్‌లో మహిళా మృతదేహం లభ్యం: అనుమానాస్పద స్థితిలో మృతి

మన పత్రిక, నర్సాపూర్: నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యమైంది. మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉంటుందని అంచనా. ఈమె మృతదేహం చేతులు కట్టేసి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికుల సమాచారం ప్రకారం, గురువారం రాత్రి సమయంలో ఈ మహిళ ఆ ప్రాంతంలో తిరుగుతూ కనిపించింది. ప్రస్తుతం మృతురాలి వివరాలు ఇంకా తెలియరాలేదు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.

Advertisement

ఘటనపై సమాచారం అందుకున్న ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలను సేకరించారు. పూర్తి దర్యాప్తు తర్వాతే మరణానికి గల కారణాలు స్పష్టమవుతాయని అధికారులు పేర్కొన్నారు.

Advertisement