మన పత్రిక, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని 161వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. జోగిపేట నుండి సంగారెడ్డి వైపు తన లూనా వాహనంపై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో, ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.
మృతుడిని కొండాపూర్ గ్రామానికి చెందిన నరసింహ గౌడ్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారిక కారు డ్రైవర్ అశోక్ గౌడ్ తండ్రి అని సమాచారం. సమాచారం అందుకున్న పుల్కల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
నిజాయితీ చాటుకున్న హైవే పెట్రోలింగ్ సిబ్బంది
ప్రమాదం జరిగిన సమయంలో మృతుడి వద్ద రూ. 12.27 లక్షల నగదు ఉంది. ఈ నగదును హైవే పెట్రోలింగ్ సిబ్బంది మనోజ్, శ్రావణ్, బాలరాజు, సాయి మరియు బాలమణి గుర్తించి, అత్యంత నిజాయితీతో పోలీసులకు అప్పగించారు. సిబ్బంది ప్రదర్శించిన ఈ నిజాయితీని స్థానికులు మరియు పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- వరంగల్ జిల్లాలో నకిలీ బంగారం మోసం: రూ.11 లక్షలు పోగొట్టుకున్న వృద్ధురాలు
- జీవో నెం.25 సవరించాలి: ప్రాథమిక పాఠశాలల్లో PSHM పోస్టుల కొనసాగింపునకు డిమాండ్
- తెలంగాణలో ఆలస్యమైన వర్షాలు: వ్యవసాయ పనులపై తీవ్ర ప్రభావం
- ప్రపంచ రికార్డు సృష్టించిన అల్లు అర్జున్ కుమార్తె అర్హ
- 3 ఇడియట్స్ చిత్రం సోనమ్ వాంగ్‌చుక్ జీవితం ఆధారంగా తీయలేదు: అమీర్ ఖాన్
