మన పత్రిక, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాల విద్యార్థిని మోక్షిత మరాఠీ భగవద్గీత కంఠస్థంలో అద్భుత ప్రతిభ కనబరిచింది. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఆమె విజేతగా నిలిచి, రాష్ట్ర స్థాయికి ఎంపికైంది.
అశోక్ నగర్ శాఖకు చెందిన మోక్షిత, ప్రాథమిక స్థాయి (ఒకటవ తరగతి వరకు) విభాగంలో ఈ ఘనత సాధించింది. చిన్ననాటి నుంచే తమ బిడ్డకు హనుమాన్ చాలీసా, భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తున్నామని తల్లిదండ్రులు వెంకట రాములు, స్వప్న రాణి తెలిపారు.
Advertisement
పిల్లలకు చిన్నప్పటి నుంచే సంస్కృతి, సంప్రదాయాలు నేర్పించడం వల్ల వారు సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని వారు పేర్కొన్నారు. మోక్షిత తల్లిదండ్రుల స్ఫూర్తిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
