మన పత్రిక, వెబ్డెస్క్: ఈ సందర్భంగా, గతేడాది మద్దూరు, దామరగిద్ద, ధన్వాడ, మరికల్, ఊట్కూర్, మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల్లో నమోదైన బాల్య వివాహాల కేసుల వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. ఆయా కేసుల పురోగతిపై అంగన్‌వాడీ సూపర్‌వైజర్లను ప్రశ్నించారు. కొందరు సూపర్‌వైజర్లు పూర్తి వివరాలు చెప్పకపోవడంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సమావేశానికి కాలక్షేపానికి వచ్చినట్లు కాకుండా, పూర్తి సమాచారంతో రావాలని గట్టిగా హెచ్చరించారు.
కొన్ని ఫిర్యాదులపై కేసులు ఎందుకు నమోదు చేయలేదని పోలీస్ అధికారులను కలెక్టర్ వివరణ కోరారు. దీనికి కొందరు అధికారులు స్పందిస్తూ.. సూపర్‌వైజర్లు సరైన పేర్లు, పూర్తి వివరాలు లేకుండా ఫిర్యాదు చేస్తున్నారని, మళ్లీ స్టేషన్‌కు రావడం లేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత అని, అన్ని శాఖలు కలిసి పనిచేయాలని కలెక్టర్ సూచించారు. మండల స్థాయిలో ఫిర్యాదు చేయడంతో పాటు, ఆ విషయాన్ని జిల్లా డీఎస్పీ దృష్టికి కూడా తీసుకురావాలని సూపర్‌వైజర్లకు స్పష్టం చేశారు.
అంతకుముందు, అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ మాట్లాడుతూ.. గ్రామ, మండల స్థాయి కమిటీలు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఈ నెల 27 నుంచి 30 వరకు మండల కేంద్రాల్లో పూజారులు, ఫంక్షన్ హాల్ యజమానులు, ఫోటోగ్రాఫర్లతో సమావేశాలు పెట్టాలన్నారు. 28 నుంచి 30 వరకు గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నారు. గుర్తించిన హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. డీఎస్పీ నల్లపు లింగయ్య మాట్లాడుతూ, 2023 నుండి 2025 వరకు నమోదైన కేసుల వివరాలను వివరించారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

