Advertisement
Nalgonda rain news

Nalgonda: వరదలో చిక్కుకున్న గురుకుల విద్యార్థులు.. కాపాడిన పోలీసులు!

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లాలో మొంథా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు దేవరకొండ కోమ్మెపల్లిలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలోకి వరద నీరు చేరింది. దీంతో విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే స్పందించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాలతో, సిబ్బంది పాఠశాలకు చేరుకుని వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. మొంథా తుఫాన్ కారణంగా జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయని, అత్యవసరమైతే తప్ప ప్రజలు రోడ్లపైకి రావద్దని ఎస్పీ హెచ్చరించారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement