Advertisement

నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

మన పత్రిక, నల్గొండ: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేక్యతండా గ్రామపంచాయతీ వస్త్రం తండా వద్ద ఇటుకల లోడుతో వెళ్తున్న ఓ లారీ, ప్యాసింజర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనలో మరో ఆరుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే, గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం వారిని హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు.

Advertisement

ఈ ప్రమాదానికి సంబంధించి మృతుల వివరాలు తదితర పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement