మన పత్రిక వెబ్డెస్క్, మేడ్చల్: పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఒక యువతికి హెచ్‌ఐవీ (HIV) పాజిటివ్ రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా బలవంతంగా ఎక్కించిన నిందితుడిని పోలీసులు శనివారం (మార్చి 14న) అరెస్టు చేశారు. మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా అన్నోజిగూడ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల దర్యాప్తు వివరాల ప్రకారం.. పోచారం గ్రామానికి చెందిన మనోహర్ అనే యువకుడికి బాధిత యువతితో కొద్ది వారాల క్రితం నిశ్చితార్థం జరిగింది. అయితే మనోహర్‌తో పాటు అతని కుటుంబ సభ్యులకు హెచ్‌ఐవీ ఉందని తెలియడంతో యువతి తల్లిదండ్రులు ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో మార్చి 11న మనోహర్ యువతి ఇంటికి వెళ్లి, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో, తన వెంట తెచ్చుకున్న సిరంజితో తన హెచ్‌ఐవీ రక్తాన్ని ఆమె శరీరంలోకి బలవంతంగా ఎక్కించి అక్కడినుంచి పారిపోయాడు.
ఘటన జరిగిన కొద్దిసేపటికే బాధితురాలికి తీవ్రమైన జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స సమయంలో యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో వెంటనే వారు పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి 14న నిందితుడు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేర తీరు ఒక తెలుగు సినిమాలోని సన్నివేశాన్ని తలపిస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
