మన పత్రిక, వెబ్డెస్క్: నల్గొండ జిల్లా ( Nalgonda District ) గుర్రంపోడు మండల పరిధిలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. జూనుతల స్టేజి వద్ద రహదారిపై ఓ బైక్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
Advertisement
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద అడిశర్లపల్లి మండలం దుగ్యాల గ్రామానికి చెందిన ఆడెపు వెంకటయ్య (55) బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలై ఆయన ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు.
Advertisement
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పసుపులేటి మధు తెలిపారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

