Advertisement
nalgonda gurrampode bike accident anusha

Nalgonda: బ్రిడ్జిపై బైకులు ఢీ, వాగులో పడి నవ వధువు మృతి!

మన పత్రిక, వెబ్​డెస్క్: నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో దారుణ ప్రమాదం జరిగింది. శేషిలేడివాగు బ్రిడ్జిపై రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చామలేడు గ్రామానికి చెందిన సిలువేరు నవీన్ (25), అతని భార్య అనుష (21) తీవ్రంగా గాయపడ్డారు.

Advertisement

ఢీకొన్న వేగానికి అనుష బ్రిడ్జి పైనుంచి ఎగిరి ప్రవహిస్తున్న వాగులో పడిపోయింది. స్థానికులు 15 నిమిషాల తర్వాత ఆమెను బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను, తీవ్ర గాయాలపాలైన భర్త నవీన్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. అయితే, అనుష మార్గమధ్యలోనే మృతి చెందింది.

Advertisement

నవీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా ఢీ కొట్టిన బైకుపై ఉన్న వ్యక్తికి, అతని ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. కేవలం పది రోజుల క్రితమే నవీన్, అనుషలకు ప్రేమ వివాహం జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement