మన పత్రిక వెబ్‌డెస్క్, నల్గొండ: రబీ సీజన్ లో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మిర్యాలగూడ సమీపంలోని తుంగపహాడ్ మార్క్‌ఫెడ్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిల్వలు, రవాణా లారీల ఏర్పాట్లపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శ్రీనివాస్ నగర్ లోని ఎరువుల దుకాణాన్ని సందర్శించి ఆన్లైన్ విక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ కు తమ సమస్యలను వివరించారు. ఆన్లైన్ లో స్టాక్ చూపించిన పది నిమిషాల్లోనే అయిపోతోందని, ఏ మండలంలోని రైతులకు అక్కడే ఎరువులు అందేలా చూడాలని కోరారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ‘ఎరువుల యాప్’ పనితీరుపై కూడా కలెక్టర్ ఆరా తీశారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
