Advertisement

District collector: నల్గొండ కలెక్టర్ తనిఖీ.. యూరియా కొరతపై కీలక ఆదేశాలు

మన పత్రిక వెబ్​డెస్క్, నల్గొండ: రబీ సీజన్ లో రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మిర్యాలగూడ సమీపంలోని తుంగపహాడ్ మార్క్​ఫెడ్ గోదామును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిల్వలు, రవాణా లారీల ఏర్పాట్లపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం శ్రీనివాస్ నగర్ లోని ఎరువుల దుకాణాన్ని సందర్శించి ఆన్​లైన్ విక్రయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు కలెక్టర్ కు తమ సమస్యలను వివరించారు. ఆన్​లైన్ లో స్టాక్ చూపించిన పది నిమిషాల్లోనే అయిపోతోందని, ఏ మండలంలోని రైతులకు అక్కడే ఎరువులు అందేలా చూడాలని కోరారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ‘ఎరువుల యాప్’ పనితీరుపై కూడా కలెక్టర్ ఆరా తీశారు.

Advertisement
Advertisement