Advertisement
nagarkurnool news

బీసీ హాస్టల్‌లో పాముల కలకలం.. కాంపౌండ్ వాల్ కట్టాలని విద్యార్థుల వేడుకోలు!

మన పత్రిక, వెబ్​డెస్క్: నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం ఊర్కొండ పేట గ్రామంలోని బీసీ హాస్టల్ విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు. తమ హాస్టల్ ప్రాంగణం విషపూరితమైన పాములకు స్థావరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

హాస్టల్‌కు సరైన కాంపౌండ్ వాల్ లేకపోవడం వల్లే తరచూ పాములు, ఇతర సర్పాలు లోపలికి వస్తున్నాయని విద్యార్థులు తెలిపారు. దీనికి తోడు హాస్టల్‌లో సరైన బాత్రూంలు కూడా లేకపోవడంతో చాలా ఇబ్బందికరంగా ఉందని వాపోయారు. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, హాస్టల్‌కు కాంపౌండ్ వాల్ మరియు బాత్రూంలు నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement