Advertisement
nagarkurnool man loses 99000 in tv recharge

Cyber Crime: 99 వేలు పోగొట్టుకున్న వ్యక్తి.. గూగుల్‌లో నెంబర్ వెతికి..

మన పత్రిక, వెబ్​డెస్క్: వివరాల్లోకి వెళితే, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్ గ్రామానికి చెందిన తిరుపతయ్య, తన సన్ డైరెక్ట్ రీఛార్జ్ కోసం గూగుల్‌లో కాంటాక్ట్ నెంబర్ వెతికారు. అతనికి 1800419 5370 నెంబర్ కనిపించింది. ఆ నెంబర్‌కు కాల్ చేసి ‘సన్ డైరెక్ట్ కస్టమర్ కేరా?’ అని అడగగా, అవతలి వ్యక్తి ‘అవును’ అని సమాధానమిచ్చాడు.

Advertisement

తిరుపతయ్య రీఛార్జ్ సమస్య గురించి చెప్పగా, ఆ వ్యక్తి టీవీ ఆన్ చేసి రూ. 10 రీఛార్జ్ చేసుకోమని సూచించాడు. బాధితుడు రీఛార్జ్ చేయగా అది ఫెయిల్ అయిందని చెప్పాడు. దీంతో ఆ సైబర్ నేరగాడు ఫోన్ కట్ చేయవద్దని, లైన్‌లోనే ఉండాలని కోరాడు.

Advertisement

సుమారు 22 నిమిషాల పాటు లైన్‌లో ఉంచి, ఏదో చెబుతూ మాటల్లో పెట్టాడు. అనుమానం వచ్చిన తిరుపతయ్య ఫోన్ కట్ చేసి తన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాడు. తన ఖాతా నుండి నాజురుల్ ఇస్లాం (ఫోన్ నెంబర్ 7029418174) అనే వ్యక్తికి ఫోన్ పే ద్వారా రూ. 99,000 బదిలీ అయినట్లు గుర్తించి నిర్ఘాంతపోయాడు.

మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై వెల్దండ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement