Advertisement

Naa Anveshana: ఆస్ట్రేలియాలో ఎన్నారైల ఫిర్యాదు.. వీసా రద్దుకు డిమాండ్

Case filed on naa anveshana youtuber in Australia: నా అన్వేష్‌కు బిగుస్తున్న ఉచ్చు.. ఆస్ట్రేలియాలోనూ పోలీసు కేసు!

మన పత్రిక, వెబ్​డెస్క్: ప్రముఖ యూట్యూబర్ ‘నా అన్వేష్’ (Naa Anveshana controversy) చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం అంతర్జాతీయ స్థాయికి చేరింది. గరికపాటి, చాగంటి కోటేశ్వరరావు వంటి ప్రముఖులతో పాటు హిందూ ధర్మంపై అన్వేష్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులు (NRIs) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా వారు అక్కడి పోలీసులకు అన్వేష్‌పై అధికారికంగా ఫిర్యాదు చేశారు. విద్వేషాన్ని రెచ్చగొడుతున్నందున అతడి వీసాను రద్దు చేయాలని ఇమిగ్రేషన్ అధికారులను కూడా కోరారు.

Advertisement

ఇప్పటికే అన్వేష్‌పై మన దేశంలో మూడు కేసులు నమోదు కాగా, హైదరాబాద్ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కు లేఖ రాశారు. మరోవైపు ఈ వ్యవహారంపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందిస్తూ, చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌కు లేఖ రాసింది. సోషల్ మీడియాలోనూ ఫాలోవర్లు ఆయన్ను భారీగా అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నారు.

Advertisement