Advertisement

కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత ఉద్రిక్తత

మన పత్రిక, కిర్లంపూడి: ప్రముఖ నేత ముద్రగడ పద్మనాభం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత కిర్లంపూడిలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముద్రగడ పార్థివదేహాన్ని చివరిసారిగా చూసేందుకు ఆయన కుమార్తె క్రాంతి వచ్చినప్పటికీ, ఆమెకు నిరాశే ఎదురైంది.

తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన క్రాంతిని ముద్రగడ భార్య మరియు బంధువులు అడ్డుకున్నారు. దీనివల్ల అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజకీయ మరియు కుటుంబ విభేదాల కారణంగానే ఆమెను అనుమతించలేదని సమాచారం అందుతోంది. దీంతో క్రాంతి వెనుదిరగాల్సి వచ్చింది.

Advertisement
Advertisement