మన పత్రిక: ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కిర్లంపూడికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కిర్లంపూడిలో ఉద్రిక్తత
మరోవైపు, కిర్లంపూడిలో కొంత ఉద్రిక్తత నెలకొన్నట్లు సమాచారం. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతిని ఆయన చివరి చూపునకు అనుమతించలేదనే అంశంపై వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
