సంక్రాంతి పండుగకు మరో రెండు వారాలే గడువు ఉండటంతో కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో కోడి పందేల నిర్వహణకు పందెంరాయుళ్లు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. గురజ, పెదపాలపర్రు, వాడవల్లి, వైఎస్ఆర్ కాలనీ తదితర గ్రామాల్లో ఇప్పటికే బరులు సిద్ధం చేసే పనులు ఊపందుకున్నాయి. పోలీసులు జూదం సాగనివ్వబోమని హెచ్చరిస్తున్నా, పండుగ సంబరాల పేరుతో పందేలకు సై అంటున్నారు.
గత నాలుగు నెలలుగా ప్రత్యేక షెడ్లలో పందెం కోళ్లను పోషిస్తున్నారు. కాకి, డేగ, నెమలి, పింగళి వంటి జాతి కోళ్లను 2.5 నుండి 3.5 కేజీల బరువు ఉండేలా సిద్ధం చేస్తున్నారు. ఒక్కో పుంజు సామర్థ్యాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.50 వేల వరకు ధర పలుకుతోందని నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతం మండలంలో సుమారు 300 పుంజులు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
