మన పత్రిక, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల ( Telangana Municipal Elections ) వేడి అప్పుడే మొదలైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆదివారం మిర్యాలగూడ 47వ వార్డు కాంగ్రెస్ ఇన్చార్జ్ ఎంఏ రుక్సానా అలిం దంపతులు, దాదాపు 200 మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నల్లమోతు సిద్ధార్థ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ దక్కదనే భయంతోనే అధికార పార్టీ నేతలు కారు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో మిర్యాలగూడలో 36 స్థానాలు గెలిచి బీఆర్ఎస్ ఊపుమీదుండగా, తాజా వలసలు ఆ పార్టీకి మరింత బలాన్నిచ్చాయి. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వలసలు వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
