మన పత్రిక, మిర్యాలగూడ: పట్టణంలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం వారు ఈ గృహ సముదాయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు.
మిగిలి ఉన్న మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ, ప్లంబింగ్ పనులను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల నిర్మాణంలో, వసతులు కల్పించడంలో ఎటువంటి రాజీ పడొద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, గృహ నిర్మాణ పీడీ రాజ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
