మన పత్రిక, సూర్యాపేట: రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్‌పై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు (డొమెస్టిక్) వినియోగించే గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.
రాష్ట్రంలో గ్యాస్ నిల్వల పరిస్థితిపై శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్), సివిల్ సప్లైస్ కమిషనర్‌తో ప్రత్యేకంగా చర్చిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రతి డీలర్ వద్ద తగినంత గ్యాస్ స్టాక్ ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సామాన్య ప్రజలకు ఎలాంటి గ్యాస్ కష్టాలు రాకుండా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు.
గ్యాస్ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను (పుకార్లను) ప్రజలు నమ్మవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. గ్యాస్ లభ్యత గురించి సామాన్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- UstaadBhagathSingh : “నా కల… ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో నెరవేరింది”! – రాశీ ఖన్నా
- Rajendraprasad : ఎం.జి.ఆర్ వివాదం: చివరికి సారీ చెప్పిన నట కిరీటి రాజేంద్రప్రసాద్!
- నిజామాబాద్ గన్నారం వద్ద ప్రైవేట్ బస్సు బోల్తా.. నలుగురు మృతి
- Miryalaguda: మిర్యాలగూడలో అధికారుల దాడులు.. 6 గ్యాస్ సిలిండర్ల సీజ్
- Ninnu Kori March 13 Episode: విరాట్‌కు సర్ప్రైజ్.. రాజ్‌కు శ్రుతి షాక్
