Advertisement

TG News: గ్రూప్-2 విజేతలకు కొలువులు.. నియామక పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్!

మన పత్రిక, మిర్యాలగూడ: తెలంగాణలో గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల వెలువడిన ఫలితాల్లో అసిస్టెంట్ జిల్లా బీసీ సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారులుగా (ఏబీసీడీఓ) ఎంపికైన 16 మందికి శుక్రవారం సెక్రటేరియట్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వారిని సత్కరించి, అభినందనలు తెలిపారు. నూతన ఉద్యోగ ప్రయాణంలో భాగంగా, బీసీ సంక్షేమ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విధుల్లో నిబద్ధత, నిజాయితీ, పారదర్శకతతో పనిచేయాలని ఆయన విజేతలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమయాదేవి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement