మన పత్రిక, వెబ్‌డెస్క్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును కేంద్రం ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’ (VB-G RAM G)గా మారుస్తున్న తరుణంలోనే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. కేవలం 36 రోజుల్లో (అక్టోబర్ 10- నవంబర్ 14 మధ్య) దేశవ్యాప్తంగా 16 లక్షల మందికి పైగా ఉపాధి హామీ కార్మికులను జాబితా నుంచి తొలగించినట్లు కేంద్రం పార్లమెంట్‌లో వెల్లడించింది.
లోక్‌సభలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీల ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. నకిలీ కార్డులు, వలసలు, మరణాలు వంటి కారణాలతో వీరిని తొలగించినట్లు తెలిపారు.
రాష్ట్రాల వారిగా కోత ఇలా.. (టాప్ లిస్ట్):
- ఆంధ్రప్రదేశ్: 11,07,339 (దేశంలోనే అత్యధికం)
- తెలంగాణ: 95,084
- ఒడిశా: 80,896
ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న ఏపీలోనే ఏకంగా 11 లక్షల మందిని తొలగించడం గమనార్హం. పథకం పేరు మార్చకముందే ప్రభుత్వం ఇలా కార్మికులను ఉపాధికి దూరం చేస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
