Advertisement

ఉపాధి హామీ పేరు మార్పు.. కేంద్రం నిర్ణయంపై ప్రియాంక గాంధీ ఫైర్!

మన పత్రిక, వెబ్​డెస్క్: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఢిల్లీలోని పలు మార్గాలు, అధికార భవనాల పేర్లు మార్చిన మోదీ సర్కార్.. తాజాగా పేదలకు అండగా ఉండే ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’ (MGNREGA) పేరును మారుస్తూ శుక్రవారం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ పథకాన్ని ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన’గా పిలవనున్నారు.

ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం పేరు మార్చడం వల్ల ప్రభుత్వానికి వచ్చే లాభమేమిటని ప్రశ్నించారు. ఈ మార్పు వల్ల లబ్ధిదారులు నష్టపోతారని, కార్యాలయాల్లో బోర్డులు, రికార్డులు మార్చడం వల్ల అనవసరపు ఖర్చు, గందరగోళం ఏర్పడుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రపతి రోడ్డును కర్తవ్యపథ్‌గా, రాజ్‌భవన్‌ను లోక్ భవన్‌గా, పీఎంవోను సేవాతీర్థ్‌గా కేంద్రం మార్చిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement