Advertisement

Meta layoffs 2026: 1,000 మందిపై వేటు.. ఏఐ వైపే జుకర్‌బర్గ్ చూపు

మన పత్రిక వెబ్​డెస్క్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) 2026లో తొలిసారిగా భారీ లేఆఫ్స్‌ను ప్రకటించింది. సంస్థకు చెందిన ‘రియాలిటీ ల్యాబ్స్’ (Reality Labs) విభాగంలో సుమారు 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం ఐటీ రంగంలో చర్చనీయాంశమైంది. ఈ విభాగంలో మొత్తం 15,000 మంది ఉద్యోగులు ఉండగా, తాజా నిర్ణయంతో దాదాపు 10 శాతం మంది ఉపాధి కోల్పోయినట్లయింది. మంగళవారం ఉదయం నుంచే ప్రభావిత ఉద్యోగులకు సమాచారం అందినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.

మెటావర్స్ కాదు.. ఇక ఏఐ ట్రెండ్ గత కొన్నేళ్లుగా మెటావర్స్ (Metaverse) ప్రాజెక్టుల కోసం వేల కోట్లు ఖర్చు చేసిన మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చారు. సంస్థ తన పూర్తి ఫోకస్‌ను మెటావర్స్ నుంచి ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ‘ఏఐ డివైజ్‌ల’ (AI devices) వైపు మళ్లిస్తోంది. ఈ వ్యూహాత్మక మార్పులో భాగంగానే రియాలిటీ ల్యాబ్స్‌లో ఉద్యోగాల కోత అనివార్యమైందని తెలుస్తోంది. టెక్నాలజీ రంగంలో వస్తున్న పోటీని తట్టుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), స్మార్ట్ వేరబుల్స్ (Wearables) ద్వారానే త్వరితగతిన ఫలితాలు సాధించవచ్చని యాజమాన్యం భావిస్తోంది.

Advertisement

నిధుల మళ్లింపు కోసమే.. ఈ లేఆఫ్స్‌పై మెటా ప్రతినిధి స్పందిస్తూ.. “మెటావర్స్‌పై పెట్టే పెట్టుబడులను తగ్గించి, వేరబుల్స్ వైపు మళ్లిస్తున్నట్లు మేము గతంలోనే సూచించాము. దీనివల్ల మిగిలే నిధులను ఈ ఏడాది వేరబుల్స్ విభాగం అభివృద్ధి కోసం తిరిగి పెట్టుబడిగా పెడతాం” అని వివరించారు. మెటా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఆండ్రూ బోస్వర్త్ అంతర్గత సందేశం ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సమాచారం.

Advertisement