Advertisement

మెదక్: తల్లి మరణం తట్టుకోలేక కుమారుడి ఆత్మహత్య

TG: మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం మక్తా లక్ష్మాపూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లి మరణవార్తను తట్టుకోలేక 19 ఏళ్ల కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళ్తే.. మక్తా లక్ష్మాపూర్‌కు చెందిన బేతమ్మ (45) బతుకుదెరువు కోసం భర్తతో కలిసి హైదరాబాద్ వెళ్లి నివాసముంటోంది. నిన్న భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో బేతమ్మ హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకుంది. తల్లి మరణవార్త తెలుసుకున్న కుమారుడు ప్రవీణ్ (19) తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయాడు. కొలపల్లి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. ఒకే కుటుంబంలో తల్లి, కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో శోకసంద్రం అలుముకుంది.

Advertisement