బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్‌బాస్’ సీజన్ 10 సంచలనాలతో రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 6న వైభవంగా ప్రారంభమైన ఈ షోలో తొలి రోజు నుంచే కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఇంటి సభ్యులను బయటకు పంపడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తొలి రోజుల్లోనే చరణ్ ఎలిమినేట్ కాగా, ఆ వెంటనే బిగ్‌బాస్ హౌస్‌మెట్స్‌కు బిగ్ టాస్క్ ఇచ్చారు. ఈ క్రమంలో సులభమైన టాస్క్ కోసం ఏడుగురు, కష్టమైన టాస్క్ కోసం ఇద్దరిని ఎంచుకోవాలని స్పష్టం చేశారు. కర్చీఫ్ టాస్క్‌లో రాంప్రసాద్ విజేతగా నిలిచి, అమన్‌ను హై రిస్క్ జోన్‌లోకి పంపారు. మరోవైపు సుధీర్, వర్షిణిలకు సీక్రెట్ టాస్క్ ఇచ్చినప్పటికీ, వర్షిణి నిబంధనలు ఉల్లంఘించడంతో వారిద్దరూ డేంజర్ జోన్‌లోనే ఉండిపోయారు.
చివరగా నిర్వహించిన ‘మహాపరీక్ష’ ఓటింగ్‌లో చైత్రకు అత్యధికంగా 3 ఓట్లు రావడంతో ఆమె కూడా ఎలిమినేట్ అయినట్లు సమాచారం. మొదటి వారంలోనే బిగ్‌బాస్ ఊహించని షాకులు ఇవ్వడంతో వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున ఎలాంటి ట్విస్టులు ఇస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Lavanya is a content writer at Mana Patrika, covering useful updates and information for Telugu readers. She writes about education, jobs, current affairs, technology, entertainment, and other topics that are relevant to everyday readers. Her focus is on presenting information in a clear, simple, and easy-to-understand way.
