మన పత్రిక, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లాలో (Medak District) పంచాయతీ ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. నర్సంపల్లి పెద్ద తండాలో శంకర్ నాయక్ అనే సర్పంచ్ అభ్యర్థి అనూహ్యంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. తన ప్రత్యర్థి గెలుపు కోసం ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని, ఒక్కో ఓటుకు రూ. 2,000 ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.
గతంలోనూ తాను ఇలాంటి కుట్రల వల్లే ఓడిపోయానని, ఇప్పుడు కూడా ధనబలం ముందు నిజాయితీ ఓడిపోతుందనే ఆవేదనతో ఈ పని చేసినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని శంకర్ నాయక్‌కు నచ్చజెప్పి కిందికి దించే ప్రయత్నం చేశారు. అక్రమాలపై విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
