Advertisement

మూసీ రిజర్వాయర్ కు భారీ వరద

మ‌న ప‌త్రిక‌, వెబ్ డెస్క్: భారీ వర్షాల కారణంగా మూసీ రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం ఒక్కసారిగా తొమ్మిది క్రస్టుగేట్లను రెండు అడుగుల మేర ఎత్తి, 11,644 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ఎగువ నుంచి 9,166 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాలువలకు 240 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Advertisement

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, గురువారం రాత్రికి 643.66 అడుగుల నీరు నిల్వ ఉంది. వరద ఉధృతి నేపథ్యంలో మూసీ నది దిగువ ప్రాంతాల్లో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి. భీమారం లోలెవల్ కాజ్‌వే వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బంది నిరంతరం వాహనదారులకు సూచనలు ఇస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement