Advertisement

మంగళగిరి రైల్వే స్టేషన్ ఆధునీకరణ: 17న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

మన పత్రిక: మంగళగిరి రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో సిద్ధమైంది. అమృత్ భారత్ పథకం కింద ఈ స్టేషన్‌ను రూ.12.56 కోట్ల వ్యయంతో ఆధునీకరించారు. ప్రయాణికుల కోసం పలు మెరుగైన వసతులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ ఆధునీకరించిన రైల్వే స్టేషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జులై 17న వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement