Advertisement

చిరు-వెంకీల మాస్ రచ్చ: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ట్రైలర్ వచ్చేసింది!

మన పత్రిక, వెబ్​డెస్క్: సంక్రాంతి పండుగకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘మన శంకర వరప్రసాద్ గారు (mana shankara varaprasad garu trailer)’ సినిమాతో వినోదాల విందు పంచేందుకు సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ ఈ ఆదివారం విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం యాక్షన్, కామెడీతో ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సాగింది. చిరు వింటేజ్ లుక్, నయనతారతో కెమిస్ట్రీ, అత్తమామలతో చిరు పడే ఫ్రస్ట్రేషన్ కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తున్నాయి.

ట్రైలర్ చివర్లో విక్టరీ వెంకటేష్ హెలికాప్టర్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. “మాస్ కే బాస్ లా ఉన్నావ్.. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటీ” అంటూ వెంకీ, చిరు మధ్య వచ్చిన సంభాషణలు ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తున్నాయి. జనవరి 12న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Advertisement