టాలీవుడ్ లో 2026 సంక్రాంతి కానుకగా ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ కి రెడీ కాగా, అందులో మూడు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. వాటిలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” (Mana shankara Varaprasad garu) ఒకటి. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం క్రిటిక్స్ పరంగా మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకున్నా, ఆడియన్స్ ని మాంచి కామెడీ ఎంటర్టైనర్ గా నవ్విస్తుంది. ముఖ్యంగా పండగ సందర్బంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకు క్యూ కట్టారు. కాగా తొలిరోజు సోమవారం వర్కింగ్ డే అయినా కూడా భారీ ఓపెనింగ్స్ రాబట్టాడు మన శంకర వర ప్రసాదు.
ఇక మన శంకర వర ప్రసాద్ కి సంబంధించి వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్క విషయానికి వస్తే… తెలుగు రాష్ట్రాల్లోనే 32 కోట్లకి పైగా షేర్ వసూలు చేయగా, సీనియర్స్ పరంగా అల్ టైం 2 ఓపెనింగ్ అని చెప్పాలి. అలాగే కర్ణాటక, రెస్ట్ అఫ్ ఇండియా కలిపి 2.55 కోట్లు, ఓవర్సీస్ లో ఏకంగా 10.15 కోట్ల షేర్ రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 45.10 కోట్ల షేర్ 74.25 కోట్ల గ్రాస్ రాబట్టింది. చిరంజీవి కెరీర్ లో “సైరా” (Syeraa) తర్వాత రాబట్టిన భారీ ఓపెనింగ్స్ ఇదే. ఇక 120 కోట్ల బిజినెస్ పై 37 శాతం రికవరీ కాగా, వసూళ్ల పరంగా 77 కోట్ల షేర్ రాబట్టాలి. పండగ ఊపులో కలెక్షన్లు, అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే మొదటి వారం పూర్తయ్యే లోపే బిజినెస్ రికవరీ చేసి క్లీన్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
అయితే తొలిరోజు ఒక్క కర్ణాటకలోని ఆశించిన పెర్ఫార్మన్స్ చేయలేదని చెప్పాలి. అయితే లాంగ్ రన్ లో ఈ సినిమా బయ్యర్లకి భారీ లాభాలు తెప్పిస్తుందని చెప్పాలి. ఇక త్వరలో రిలీజ్ కానున్న అనగనగ ఒకరాజు (Anaganaga okaraju) , నారి నారి నడుమ మురారి (Narinari Nadumamurari) సినిమాలతో సంక్రాంతి పోటీ మరింత రసవత్తరం కానుందని తెలుస్తుంది. మరి పొంగల్ రేసు లో ఏ సినిమా ఎంత జోరు చూపిస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
