Advertisement

హాజీపూర్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీనివాస్ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఎస్సై స్వరూప్ రాజ్ కథనం ప్రకారం.. బుధవారం ఉదయం కోడిగుడ్ల కోసం ప్రధాన రహదారిపైకి నడుచుకుంటూ వచ్చిన శ్రీనివాస్‌ను బైక్ ఢీకొంది. గాయపడిన శ్రీనివాస్‌ను కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి.. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించాడు.

Advertisement