Advertisement

మహాకాళి సినిమా విడుదల తేదీ ఖరారు

మన పత్రిక: దర్శకుడు ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU)లో భాగమైన కొత్త సినిమా ‘మహాకాళి’ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ‘హనుమాన్’ చిత్రం తర్వాత భారతీయ పురాణాల ఆధారంగా సూపర్ హీరో కథాంశంతో వస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2027 జనవరి 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఆగస్టు 24న ‘మాస్ గ్లింప్స్’ను విడుదల చేయనున్నట్లు ప్రశాంత్ వర్మ తెలిపారు. అలాగే రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా మార్నింగ్ షో అనంతరం మీడియా ప్రతినిధుల కోసం మహాకాళి చిత్రానికి సంబంధించిన ప్రత్యేక టీజర్‌ను ప్రదర్శించారు. కాళికా దేవి, శక్తి భావనల ప్రేరణతో శక్తివంతమైన మహిళా సూపర్ హీరో ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Advertisement
Advertisement