Advertisement

Mahabubabad: బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టి తాళం!

మన పత్రిక, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బతికుండగానే ఓ వ్యక్తిని మార్చురీలో పెట్టి తాళం వేశారు. బాధితుడు చిన్నగూడూరుకు చెందిన టాక్సీ డ్రైవర్ రాజుగా గుర్తించారు.

గుర్తు తెలియని శవమని భావించిన సిబ్బంది, రాజును రాత్రంతా మార్చురీలోనే ఉంచారు. ఉదయం ఓ స్వీపర్ గమనించి, రాజు బతికే ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతడిని బయటకు తీసి తిరిగి ఆసుపత్రిలో చేర్పించారు. ఆధార్ కార్డు లేదనే కారణంతోనే వైద్య సిబ్బంది అతడిని మొదట అడ్మిట్ చేసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఈ దారుణ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement