Advertisement

Lokah chapter 1 telugu: దూసుకుపోతున్న మ‌ల‌యాళం సినిమా

మన పత్రిక, వెబ్​డెస్క్

Advertisement

ఇటీవల థియేటర్లలో విడుదలైన మలయాళ చిత్రం ‘కొత్త లోక’ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో కొంత ఆలస్యంగా, పలు సమస్యల మధ్య విడుదలైనా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో నాగవంశీ సమర్పణలో విడుదల చేశారు. డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.

Advertisement

సూపర్ హీరో కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రంలో కల్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించారు. ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ కీలక పాత్రలో మెప్పించారు. వీకెండ్ రావడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. శనివారం తెలుగు రాష్ట్రాల నుంచి సినిమా ఒక కోటి రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. పెద్దగా ప్రచారం లేకుండా, బజ్ లేకుండా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం విశేషం. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకు మంచి రివ్యూలు ఇస్తున్నారు. సినీ విశ్లేషకులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Lokah chapter 1 chandra collection

మొత్తం భారత్ నెట్ కలెక్షన్ (4 రోజులు): ₹24.30 కోట్లు
అంచనా బడ్జెట్: ₹30 కోట్లు

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement