మన పత్రిక, వెబ్‌డెస్క్ : సాధారణంగా 11 ఏళ్ల పిల్లలు స్కూల్ వెళ్లి, హోం వర్క్ చేసి, ఆటలు ఆడుతూ సమయం గడుపుతారు. కానీ కేరళలోని కన్నూర్ కు చెందిన 11 ఏళ్ల వైఘశ్రీ మాత్రం తన వయసుకు అతీతంగా సేంద్రియ సాగులో నిపుణురాలుగా మారింది. ఇంటి పెరట్లోనే రకరకాల కూరగాయలు పండిస్తూ అందరి చేతా “శెభాష్!” అనిపించుకుంటోంది.
ఈ ప్రయాణం 2019లో ప్రారంభమైంది. ఆమె తండ్రి ఒక ప్రమాదం తర్వాత ఆరోగ్యం కోలుకునేందుకు మొక్కలు పెంచడం మొదలుపెట్టాడు. అప్పుడు వైఘశ్రీ కేవలం 5 ఏళ్లు. తండ్రితో పాటు తోటపనిలో సాయం చేస్తూ, నేల, నీరు, విత్తనాల గురించి నేర్చుకుంది. క్రమంగా ఆమె స్వయంగా మొక్కలు నాటడం, నీరు పోయడం, సేంద్రియ ఎరువులు తయారు చేయడం నేర్చుకుంది. యూట్యూబ్ వీడియోలు, నిపుణుల సలహాల ద్వారా మొక్కల సంరక్షణ, విత్తన శుద్ధి, తెగుళ్ల నివారణ వంటి సంక్లిష్ట అంశాలు కూడా నేర్చుకుంటోంది. తన 8 సెంట్ల స్థలంలో టమాటా, కాకరకాయ, బీన్స్, క్యారెట్లు సహా అన్ని రకాల కూరగాయలు పండిస్తోంది. ఆమె పండించిన కూరగాయలను అమ్మకం చేయడం లేదు. ఇంటి అవసరాలకు ఉపయోగించి, మిగిలినవి పొరుగువారికి, అవసరమైన వారికి ఉచితంగా ఇస్తుంది. తన పాఠశాల మధ్యాహ్న భోజన కార్యక్రమానికి కూడా కూరగాయలు సరఫరా చేస్తోంది.
ఈ అద్భుత కృషికి గుర్తింపుగా, పంచాయతీ అధికారులు ఆమెకు రెండుసార్లు ‘కుట్టి కర్షక’ (చిన్నారి రైతు) పురస్కారం ప్రదానం చేశారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
