ఇండిగోకు రూ.20 లక్షల జరిమానా – పైలట్ శిక్షణలో లోపాలు, DGCA చర్య
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై రూ.20 లక్షల జరిమానా విధించింది. ‘కేటగిరీ C ఏరోడ్రోమ్‌లలో పైలట్ శిక్షణకు అర్హత లేని సిమ్యులేటర్లను’ ఉపయోగించినందుకే ఈ చర్య తీసుకుంది. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఈ ఆర్డర్‌ను సవాలు చేయనున్నట్లు తెలిపింది. కానీ, ఈ జరిమానా ఎయిర్‌లైన్ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు