Advertisement

ఢిల్లీకి బయల్దేరిన కేటీఆర్: కుమారస్వామితో కీలక భేటీ

మన పత్రిక: భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకుడు కేటీఆర్ ఢిల్లీకి బయల్దేరారు. ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరేందుకు ఆయన ఈ పర్యటన చేపట్టారు.

కేటీఆర్‌తో పాటు వద్దిరాజు రవిచంద్ర, జోగు రామన్న తదితర ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి వెళ్లిన వారిలో ఉన్నారు. ఈ భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడతారని సమాచారం.

Advertisement
Advertisement