Advertisement

రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది: కేటీఆర్

మన పత్రిక, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతాంగాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలువునా ముంచేస్తోందని బీఆర్ఎస్ (BRS) నాయకుడు కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం బద్నాం చేయాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం కావాలని నీటిని విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు మూయకుండానే, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసే అవకాశం ఉందని ఆయన వివరించారు.

ఈ పద్ధతిలో వంద రోజుల్లోనే దాదాపు రెండు వందల టీఎంసీల నీటిని ఎత్తిపోసి, వ్యవసాయానికి అందించవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను విస్మరించి రాజకీయాలు చేస్తోందని ఆయన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పంటలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement