మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిల విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ‘సీరియల్ స్నాచర్’ (Serial Snatcher) లా వ్యవహరిస్తూ విశ్వవిద్యాలయాల భూములను లాక్కుంటోందని మండిపడ్డారు. ఉర్దూ వర్సిటీ భూముల వివాదం నేపథ్యంలో నందినగర్ లో విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం భూములు తీసుకోవడం ఇదే తొలిసారి కాదని, గతంలో జయశంకర్ వ్యవసాయ వర్సిటీ నుంచి 100 ఎకరాలు తీసుకున్నారని గుర్తుచేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూములను లాక్కునే ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. విద్యా సంస్థల భూములను కాపాడాల్సిన ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
