మన పత్రిక వెబ్‌డెస్క్, కోనరావుపేట: చారిత్రక, సాంస్కృతిక విషయాలపై అవగాహన పెంచేందుకు కోనరావుపేట పీ.ఎం.శ్రీ ఎం.పీ.పీ.ఎస్ పాఠశాల విద్యార్థులు వరంగల్ విజ్ఞాన యాత్రకు వెళ్లారు. ఈ యాత్రలో రామప్ప, వేయి స్తంభాల గుడి, వరంగల్ ఖిల్లా, భద్రకాళి ఆలయం, లక్నవరం సరస్సులను సందర్శించారు.
ముఖ్యంగా రామప్ప ఆలయంలోని రుద్రదేవుడు, నందీశ్వరుని విగ్రహాలు, సన్నని దారం దూర్చేంత సూక్ష్మ రంధ్రాలున్న స్తంభాల పనితనం గురించి ఉపాధ్యాయులు వివరించారు. అలాగే, నృత్య భంగిమలను తెలిపే శిల్పాలు, కాకతీయుల శిల్పకళా వైభవం, రామప్ప చెరువు ప్రాముఖ్యతను విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు తెలియజేశారు.
Advertisement
ఈ విజ్ఞాన యాత్రలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మదన్ లాల్, ఉపాధ్యాయులు విజయకుమార్, భాస్కర్, రాము, వెంకటేష్, సంజీవ్, శృతి, అనూష, రాధలతో పాటు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
