మన పత్రిక వెబ్డెస్క్, కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఈ నెల 26న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొమురవెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ (Railway Station) ను ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు బస్సులు, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడిన భక్తులకు ఈ స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణ సౌలభ్యం కలగనుంది. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వరకు సాగే ఈ రైలు ప్రయాణం భక్తులకు సమయాన్ని, ఖర్చును ఆదా చేయనుంది. రోజుకు రెండు రైళ్లు సికింద్రాబాద్ వైపు నుంచి సిద్దిపేట వైపు రాకపోకలు సాగిస్తాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. పండుగలు, జాతర సమయాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ మార్గాలను కరీంనగర్, కాజీపేట ప్రాంతాలకు అనుసంధానించేలా రైల్వే శాఖ (Railway Department) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
