Advertisement

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన

మన పత్రిక, భద్రాద్రి కొత్తగూడెం: కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి ఈనెల 13న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను తెలుసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి భరోసా యాత్రను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన కొత్తగూడెం చేరుకుని కార్మికుల సమావేశంలో పాల్గొంటారు.

అనంతరం మణుగూరు ప్రాంతానికి చేరుకుని పీకే ఓసీ-2 (PK OC-2) ఓపెన్ కాస్ట్ గనిని సందర్శిస్తారు. అక్కడ బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించడంతో పాటు కార్మికుల కష్టనష్టాలను నేరుగా అడిగి తెలుసుకోనున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, భారతీయ మజ్దూర్ సంఘ్ (BMS) నాయకులు పాల్గొంటారు. మణుగూరు పర్యటన ముగిసిన తర్వాత కిషన్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు.

Advertisement
Advertisement